
వన మహోత్సవం లక్ష్యం నెరవేరేనా?
నిజాంసాగర్ : వర్షాకాలం సీజన్‌ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయినా జిల్లాలో ఇప్పటికీ మొక్కలు నాటే కార్యక్రమం జోరందుకోలేదు. దీంతో జిల్లా వన మహోత్సవం లక్ష్యానికి దూరంగానే ఉండిపోయింది. ప్రతి పంచాయతీ పరిధిలో నాలుగు వేల మొక్కలు నాటాలని ముందుగా నిర్ణయించారు. అయితే సరైన వర్షాలు లేకపోవడంతో లక్ష్యాన్ని సగానికి తగ్గించారు. ఈనెలాఖరు వరకు ప్రతి పంచాయతీలో 2 వేల మొక్కలు నాటాల్సి ఉన్నా ఎక్కడా వన మహోత్సవం సరిగా సాగుతున్న దాఖలాలు లేవు. మరోవైపు నర్సరీలలోనూ మొక్కల పెంపకం తూతూమంత్రంగానే సాగింది. ప్రతి నర్సరీలో 4 వేల మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నా.. చాలాచోట్ల అరకొరగానే మొక్కలున్నాయి. వన మహోత్సవంపై పంచాయతీ అధికారులు, ఈజీఎస్ సిబ్బంది శ్రద్ధ చూపకపోవడంతో నర్సరీల నిర్వహణ అధ్వానంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
నర్సరీల్లో అరకొరగానే మొక్కలు
పట్టించుకోని అధికారులు