
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాల పంట
కామారెడ్డి అర్బన్ : ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ యోగాసన పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఈ పోటీల్లో జిల్లాకు ఎనిమిది పతకాలు వచ్చాయని యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు. డి.సురేందర్ బ్యాక్ బెండింగ్ విభాగంలో బంగారు, ట్రెడిషన్ విభాగంలో రజత పతకాలు సాధించారని పేర్కొన్నారు. సీహెచ్.రాజ్‌కుమార్ ట్విస్టింగ్, సుపైన్‌లో కాంస్యం, ఫార్వర్డ్ బెండింగ్‌లో వెండి పతకాలు, యు.అనిల్‌కుమార్ ఫార్వర్డ్ బెండింగ్‌లో కాంస్యం సాధించారని తెలిపారు. సీహెచ్.తిరుపతి హ్యాండ్ బ్యాలెన్స్‌లో కాంస్యం, ఏ.రాజు ట్రెడిషన్ విభాగంలో వెండి పతకాలు సాధించారని వివరించారు. మరికొందరు క్రీడాకారులు ప్రశంస పత్రాలు అందుకున్నారన్నారు.