
కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎమ్మెల్యే సమావేశం
పిట్లం(జుక్కల్):మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.. మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాయకులు గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పలు సమస్యలను అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు.
గురుకులంలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవం
మద్నూర్(జుక్కల్): భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం సంస్కృత భాష అని సంస్కృత భాష ప్రచార సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించి మాట్లాడా రు.అన్ని భాషలకు సంస్కృతం అమ్మభాష అని అన్నా రు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, రామాయణం, మహాభారతం తది తర గ్రంథాలు దేవనాగరిలిపిలో రచించబడ్డాయని చెప్పారు. భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను ప్రేమించాలని, నేర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు సంస్కృత గేయాలు, సుభా షితాలను, శ్లోకాలను ఆలపించారు. ప్రిన్స్‌పాల్ గంగాకిషోర్, ఉపాధ్యాయులు సుమన్, నరహరి, సంజీవ్, ఆశోక్, ప్రవీణ్, హన్మండ్లు, నరేష్, బస్వరాజు, విద్యార్థులున్నారు.
ఉదారత చాటుకున్న
చింత శ్రీనివాస్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్ : మండలంలోని మూడో డివిజన్ గూపన్‌పల్లి గ్రామంలోని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు చింత శ్రీనివాస్‌రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉదారత చాటుకున్నాడు. తన తల్లి నర్సమ్మ జ్ఞాపకార్థం మేరకు శనివారం నుంచి గ్రామంలో జన్మించిన ప్రతి ఆడ బిడ్డకు తనవంతు సహాయంగా రూ. 5116 ఇస్తానని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎమ్మెల్యే సమావేశం