
యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి
బాన్సువాడ: జిల్లాలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మన్సూర్ అన్నారు. శనివారం బాన్సువాడలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..యువజన కాంగ్రెస్‌లో పని చేయడమే లక్ష్యంగా ప్ర తి కార్యకర్త ముందుకు వెళ్లాలని అన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. యువజన నాయకులు కాసుల రోహిత్, అలిబిన్‌అబ్దుల్లా, ఖలేక్, నగేష్, అప్రోజ్, రెంజర్ల సాయిలు, అజీం, గంగాధర్, భాను, అర్జున్, గౌస్, ఇలియాస్, తదితరులు ఉన్నారు.
బిచ్కుందలో..
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో జెండాను యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 9 ఆగస్టు 1960లో యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్, అశోక్, జీవన్, విఠల్‌రావు, అజీం పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి