
ఎస్సారెస్పీలోకి పెరిగిన వరద
బాల్కొండ: ఎస్సారెస్పీలోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద మరింత పెరిగింది. ప్రాజెక్ట్‌లోకి 14630 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేలు, లక్ష్మికాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 300, అలీసాగర్ లిప్టు ద్వారా 180, గుత్ప లిప్టు ద్వారా 270, ఆవిరి రూపంలో 462, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగుల నీ రు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.40(40.8 టీఎంసీలు) అడుగుల నీటి ని ల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
టీఎన్‌జీవీఏ నూతన
కార్యవర్గం ఎన్నిక
డొంకేశ్వర్: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ (టీఎన్‌జీవీఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా తిరుమల వినీత ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి గా గంగరాజు, సహాధ్యాక్షుడిగా వినోద్, కోశాధికారిగా వెంకటి, ఉపాధ్యాక్షులుగా రమేశ్, ప ద్మావతి, నారాయణ, గంగాధర్, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవో స్ జిల్లా అధ్యక్షుడు సుమన్‌తో పాటు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బింగి సురే శ్,అభిషేక్ రెడ్డిలుసన్మానించి అభినందించారు.
క్యాంపస్‌లో కొనసాగుతున్న
తీజ్ ఉత్సవాలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో శనివారం ఆరో రోజు తీజ్ ఉత్సవాలు కొ నసాగాయి. ఈ సందర్భంగా తెయూ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సాగర్‌నాయక్ మా ట్లాడుతూ.. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రవీందర్‌నాయక్, గిరిజనశక్తి విద్యార్థి సంఘం అధ్యక్షు డు శ్రీనురాథోడ్, సచిన్, మోహన్, రాము, రాజు, విద్యార్థినులు అశ్విని పాల్గొన్నారు.
అడవి మామిడిపల్లి రైల్వేగేట్
శాశ్వతంగా మూసివేత
మాక్లూర్: మండలంలోని అడవి మామిడిపల్లి వద్ద ఆర్వోబీ పనులు పూర్తయి, వాహనా ల రాకపోకలు సాగుతుండటంతో అక్కడ ఉ న్న రైల్వేగేట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్న ట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈనెల 9 నుంచి రైల్వేగేట్‌ను ఎత్తివేస్తున్నట్లు మాక్లూర్ తహసీల్దార్, పోలీసులకు ఉత్తర్వు కాపీలను పంపించినట్లు వెల్లడించారు. కానీ కొందరు వాహనదారులకు ఈ విషయం తెలియక ఇంకా శనివారం రాత్రి వరకు రైల్వేగేట్ నుంచే రాకపోకలు సాగించారు.
ఆర్మూర్‌లో
చిరుత కలకలం
ఆర్మూర్‌టౌన్: పట్టణ శివారులోని పెద్దమ్మ ఆలయం పరిసరాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పలువురు భక్తులకు ఒక్కసారిగా కోతులు పరిగెత్తిరావడంతో ఆందోళన చెందారు. ఈక్రమంలో వారు పరిసరాలను పరిశీలించగా సుదూరంలో చిరుత కనిపించడంతో భయంతో హుటాహుటిన ఆలయం నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఆలయ పరిసరా ప్రాంతాల్లో మేతకు వెళ్లిన గొర్రెల మంద నుంచి ఒక మేక కనబడకుండపోయినట్లు గొర్ల కాపరులు శుక్రవారం రాత్రి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత ఆనవాళ్లను గుర్తించడానికి ఆదివారం వెళ్లనున్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు.

ఎస్సారెస్పీలోకి పెరిగిన వరద

ఎస్సారెస్పీలోకి పెరిగిన వరద