
● అభినందిస్తున్న ఎస్పీ రాజేశ్ చంద్ర
● సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు ● ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన వారి ప్రాణాలు కాపాడి పునర్జన్మనిస్తున్నారు ● శాంతిభద్రతలతోపాటు ప్రాణాల రక్షణ
శాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడటం తమకు ముఖ్యమేనంటున్నారు పోలీసులు. వివిధ కారణాలతో
జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేస్తున్న
వారి ప్రాణాలను కాపాడుతూ ప్రాణదాతలుగా
నిలుస్తున్నారు. సమాచారం అందిన
నిమిషాల్లోనే ఘటనాస్థలాలకు చేరుకుని
విలువైన ప్రాణాలను కాపాడుతున్నారు.