
గిరిజన ఉత్పత్తులలో నంబర్ వన్
లింగంపేట(ఎల్లారెడ్డి) : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని కుమురం భీమ్ ఆదివాసి బంజారా భవన్‌లో సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి గిరిజన ఉత్పతుల ప్రదర్శనలో లింగంపేట ప్రథమ స్థానంలో నిలిచిందని ఏపీఎం వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా పది మందిని స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంపిక చేయగా, కామారెడ్డి నుంచి లింగంపేట మండల కేంద్రానికి చెందిన రాథోడ్ దుర్గాబాయి ఎంపికై నట్లు తెలిపారు. ఆమె తయారు చేసిన బంజారా ఆభరణాలు, అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా దుర్గాబాయిని మండల సమాఖ్య సిబ్బంది అభినందించారు. దుర్గాబాయిని ప్రోత్సహించిన ఏపీఎంతోపాటు సీసీలు మెహర్, అశోక్‌ను జిల్లా అధికారులు అభినందించారు.