
భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరీ దేవి నవమి వార్షికోత్సవాలు
కామారెడ్డి అర్బన్: స్థానిక వీక్లీ మార్కెట్‌లోని శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆలయ నవమి వార్షికోత్సవం పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు అష్టోత్తర కలశాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పట్టణ మున్నూరు కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. నేతలు ముదాం శ్రీనివాస్, మల్లేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న శ్రావణమాస భజనలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు అమర్లబండ, తుక్కోజీవాడి, తిమ్మోజీవాడి, పద్మాజీ వాడి, ఉత్తునూర్, కల్వరాల్ తదితర గ్రామాల్లో శ్రావ ణమాస భజనలు కొనసాగుతున్నాయి. ఆలయాల్లో ప్రతి రోజు కీర్తనలు ఆలపిస్తూ భక్తిని చాటుతున్నారు.

భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరీ దేవి నవమి వార్షికోత్సవాలు