
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
బీబీపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శేరిగల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆరోగ్య కార్యకర్తలు హరిప్రసాద్, సుశీల, ఆశ కార్యకర్తలు గంగ, జ్యోతి పాల్గొన్నారు.
ప్రతి శుక్రవారం నిల్వనీటిని పారబోయాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం నీటి తొట్టెలు, ట్యాంకుల్లో నీటిని పారబోసి కొత్త నీటిని నింపుకోవాలని బోర్లం పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ సూచించారు. శుక్రవారం ఆయన బోర్లం గ్రామంలో ఆరోగ్య, ఆశ కార్యకర్తలతో కలిసి ప్రజలను చైతన్య పరిచారు. ఏఎన్‌ఎం అనురాధ, ఆశ కార్యకర్త సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో శుక్రవారం ఫ్రైడేడ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాలలో తిరుగుతూ సీజనల్ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో ప్రజలకు అవగాహన కల్పించారు.