తల్లి పాల వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

తల్లి పాల వారోత్సవాలు

Aug 9 2025 5:58 AM | Updated on Aug 9 2025 5:58 AM

తల్లి

తల్లి పాల వారోత్సవాలు

బీబీపేట: తల్లి పాల ప్రాముఖ్యతపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లులు తమ పిల్లలకు తల్లి పాలను సక్రమంగా అందించడం లేదు. ఫలితంగా పిల్లలకు సరైన పోషకాలు అందక వ్యాధుల బారిన పడుతున్నారు. వారి ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తల్లి పాల వారోత్సవాలను ప్రారంభించింది.

దోమకొండ ప్రాజెక్టు పరిధిలో 238 కేంద్రాలు..

దోమకొండ ప్రాజెక్టు పరిధిలో దోమకొండ, బీబీపేట, భిక్కనూర్‌, మాచారెడ్డి, రాజంపేట, పాల్వంచ మండలాలు ఉన్నాయి. మొత్తం 238 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 1,293 మంది గర్భిణులు, 1,109 మంది బాలింతలు ఉ న్నారు. 6 నెల లోపు చిన్నారులు 1,121 మంది ఉండగా, 7 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు వర కు 12,456 మంది చిన్నారులున్నారు. వీరందరికి అంగన్వాడి కార్యకర్తలు పౌష్టికాహారం అందిస్తున్నా రు. పౌష్టికాహారంతో పాటు తల్లి పాల ప్రాము ఖ్యతను వివరిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితా లు రాకపోవడంతో ప్రభుత్వం తల్లి పాల వారోత్సవాలపై ఊరూర అవగాహన కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లిదండ్రులతో పాటు ఆశ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారుల ను భాగస్వామ్యం చేసింది. వీరంతా గ్రామాల్లో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లి పాల ప్రాముఖ్య తను వివరిస్తున్నారు. బిడ్డ పుట్టగానే గంటలోపు త ల్లి పాలను బిడ్డకు పట్టించాలని, 6 నెలల వరకు తల్లి పాలను అందించాలని, తల్లి పాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు అందుతాయని, చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు అవగాహన కల్పిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

ప్రతి ఏటా నిర్వహిస్తున్న ట్లుగానే ఈ ఏడు కూడా అంగన్‌వాడీ కేంద్రాల్లో తల్లిపా ల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ప్రతి కేంద్రంలో తల్లుల కు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. వాటి వల్ల ఉపయోగాలు, చిన్నారులకు ఎంత వరకు ఆరోగ్యంగా ఉంటాయో చెబుతున్నాం. తల్లులు కచ్చితంగా తమ పిల్లలకు బయటి పాలు తాగించొద్దు. కచ్చితంగా తల్లిపాలను మాత్రమే పట్టాలి.

– రోచిష్మ, ఐసీడీఎస్‌ సీడీపీవో, దోమకొండ

అంగన్‌వాడీల్లో తల్లులకు

అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌

చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతున్న సిబ్బంది

తల్లి పాల వారోత్సవాలు1
1/1

తల్లి పాల వారోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement