
నూరుశాతం పన్ను వసూళ్లు చేయాలి
● ట్రేడ్ లైసెన్సుల్లో జాప్యం వద్దు
● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● నగర పాలక సంస్థ పనితీరుపై సమీక్ష
నిజామాబాద్ సిటీ : బల్దియాకు రావాల్సిన వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలో కమిషనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మెప్మా విభాగాల్లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్‌కుమార్ అన్ని విభాగాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఆస్తి పన్ను వసూళ్లు, నీటి చార్జీలు, తాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, భవన ని ర్మాణాలకు అనుమతులు, ఎల్‌ఆర్‌ఎస్, ఇంజినీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పాత బకాయిలు రికవరీ చేయాలని ఆదేశించారు. పెద్ద మొత్తంలో ఆస్తి ప న్ను పెండింగ్‌లో ఉంటే, వాటి యజమానులకు నో టీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్పందించకుంటే సీజ్ చేయాలన్నా రు. 100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు జరిగే లా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలు నిలిపివేయాలని ఏసీపీ ని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మెప్మా కార్యకలాపాలపై ఎ ప్పటికప్పుడు రిపోర్టు సిద్ధం చేయాలన్నారు. సీవో లు పని తీరును మెరుగుపర్చుకోవాలని, పనితీరును ఎప్ప టికప్పుడు సమీక్షించాలని టీపీఆర్‌వో చిదుర రమేశ్ ను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల ని ర్వహ ణ, పర్యవేక్షణకు శానిటరీ సూపర్‌వైజర్లు తనిఖీలు చేయాలన్నారు. శానిటేషన్‌ి సిసబ్బంది హాజరులో గోల్‌మాల్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఇన్‌చార్జి ఎంహెచ్‌వో రవిబాబు, ఈఈ మురళీ మోహన్ రెడ్డి, డీఈలు సుదర్శన్‌రెడ్డి, ముస్తా క్, రషీద్, ఏఈ పావని, కరీం, ఏసీపీ శ్రీనివాస్, టీపీఆర్‌వో చిదుర రమేశ్, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.