
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్‌అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వే డుకలను అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరె న్స్ హాల్‌లో శుక్రవారం అన్ని శాఖల అధికారుల తో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించా రు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. లోటుపాట్ల కు తావులేకుండా వేడుక లు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్ర గతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అ న్ని శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనతోపాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రొ టోకాల్‌ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పా టు చేయాలన్నారు. ఎక్కడ కూడా జాతీయ ప తాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్ర శంసాపత్రాల బహూకరణ కోసం శాఖల వారీ గా ఉత్తమ ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువు లోపు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకి త్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగ ర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబా ద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.