
ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్‌ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి స్థానిక ఎ గువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో వరద పెరిగింది. దీంతో శుక్రవారం ఉదయానికి 7593 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కు లు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, సర స్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, అలీసా గర్ లిప్టు ద్వారా 180 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో, ఔ ట్‌ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మ ట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగుల నీరు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.20 (40.30 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.