
గడ్డి మందు పిచికారీ చేసిన వరి పొలాన్ని పరిశీలిస్తున్న ఆర్డీవో పార్థసింహారెడ్డి, అధికారులు
గండిమైసమ్మకుంట ఘటనపై ఆర్డీవో పార్థసింహారెడ్డి
గడ్డి మందు పిచికారీ చేసిన పొలం పరిశీలన
విచారణ అనంతరం చర్యలు తీసుకుంటాం
గాంధారి(ఎల్లారెడ్డి): అటవీశాఖ భూమిలో వరి నాట్లు వేసేప్పుడు ఎందుకు అడ్డుకోలేదని సంబంధిత అధికారులను ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థిసంహారెడ్డి ప్రశ్నించారు. మండల పరిధిలోని సీతాయిపల్లి గ్రామాన్ని తహసీల్దార్ రేణుకాచౌహాన్, ఎఫ్‌ఆర్వో హేమచందనతో కలిసి ఆర్డీవో గురువారం సందర్శించారు. గండిమైసమ్మ అటవీప్రాంతంలో రైతులు కోరే పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య సాగు చేస్తున్న వరి పొలంపై అటవీఅధికారులు గడ్డిమందు పిచికారీ చేయగా, పొలాన్ని ఆర్డీవోతోపాటు అధికారులు గురువారం పరిశీలించారు. రైతులు, గ్రామస్తులతో మాట్లాడి భూమి వివరాలు తెలుసుకున్నారు. భూమి అటవీ శాఖకు చెందినదైతే రైతులు గత కొన్నేళ్ల నుంచి ఎలా సాగు చేస్తున్నారన్నారు. పొలంపై గడ్డి మందు పిచికారి చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో అన్నారు. ఆయనవెంట అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.
నిషేధిత గడ్డి మందు పిచికారీ
ప్రభుత్వం నిషేధించిన గడ్డిమందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు విక్రయించారని గ్రామస్తులు ప్రశ్నించారు. నిషేధించిన మందులను విక్రయిస్తే వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. విక్రయించిన వారు, తెచ్చిన వారు, పిచికారీ చేసిన వారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..
నాటు వేసిన వరి పొలంలో గడ్డిమందు పిచికారి చేసి ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై చ ర్యలు తీసుకుని పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సీతాయిపల్లి గ్రా మ రైతులు అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతిప త్రం అందజేశారు. గత 30 ఏళ్లుగా గ్రామ శివారులోని గండిమైసమ్మ కుంట ప్రాంతంలో సు మారు ఏడు ఎకరాల భూమిని సాగు చేస్తున్నా మన్నారు. సదరు భూమిని సాగు చేసిన రైతు త న భూమిని కుర్మసంఘానికి అప్పగించి గ్రామం విడిచి వలస వెళ్లాడని, సంఘం సభ్యుల నుంచి కోరె పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య కౌలుకు తీ సుకుని వరి సాగు చేస్తున్నారన్నారు. అయితే అ టవీ శాఖ అధికారులు వరి సాగు చేసిన భూమి అటవీ శాఖకు చెందినదని పొలంపై గడ్డి మందు పిచికారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.