
చేనేత కార్మికులకు కేంద్రం అండ
దోమకొండ: చేనేత కార్మికులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం దోమకొండ మండల కేంద్రంలో గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఆనంద్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యకమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని, చేనేతలకు రుణం, ఇన్సూరెన్స్ సదుపాయాలు అందిస్తుందన్నారు. స్థానిక ఆనంద్‌భవన్‌లో మగ్గాలను ఏర్పాటు చేసి బట్టలను నేయడం, వాటిని ఇతర ప్రాంతాలకు పంపించి అమ్మకాలు చేయడం పట్ల ట్రస్టు ప్రతినిధులను అభినందించారు. చేనేత కార్మికులకు తనవంతుగా ఎలాంటి అవసరం ఉన్నా ఆదుకుంటానని వారికి హామీ ఇచ్చారు. చేనేత మహిళా కార్మికులను శాలువాతో సన్మానించారు. చేనేత జెండాను ఎగురవేశారు. గడికోట వారసులు కామినేని అనిల్‌కుమార్, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ కామినేని శోభన, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రీయ సేవికా సమితి ఆధ్వర్యంలో మహిళలు రాఖీలు కట్టారు. మహిళలకు అన్ని విధాలుగా సోదరుడిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలి
రామారెడ్డి: గల్ఫ్ కార్మికులు ఆయా దేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కోరినట్లుగా గల్ఫ్ సమాఖ్య మండలాధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గురువారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సన్మానించి గల్ఫ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిపారు.
ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి