
అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని వినతి
దోమకొండ: భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద దోమకొండకు వెళ్లే దారిలో అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. దోమకొండ, బీబీపేట మండలాలతో పాటు సిద్దిపేట జిల్లాకు వెళ్లే దారి కావడంతో అండర్‌పాస్ బ్రిడ్జి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చొరవ తీసుకుని పనులు జరిగేలా చూడాలని వారు కోరారు. మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, తదితరులు ఉన్నారు.