
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ అన్నారు. ఆయన గురువారం ఎర్రాపహాడ్, నందివాడ గ్రామాలలో పర్యటించారు. మంచి నీటి ట్యాంకులను ఎప్పిటికప్పుడు కడుగుతూ శుభ్రం చేయాలన్నారు. డ్రెయినేజీలలో ఉన్న మురికి తొలగించి దోమల నివాణకు మందులను పిచికారీ చేయాలన్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడినట్లయితే వెంటనే పూడ్చి వేయాలని, లేకుంటే నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశముందన్నారు. మొక్కలను సంరక్షించి అవి చెట్లుగా మారే వరకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానాలను పరిశీలించారు. ఎంపీడీవో సయ్యద్ సాజీద్‌అలీ, తదితరులు ఉన్నారు.