
24న బస్వన్నపల్లిలో భారత్ కిసాన్ సంఘ్ శిక్షణ తరగతులు
రాజంపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించినట్లు మండల అధ్యక్షులు మర్రి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి మాట్లాడుతూ.. సంఘ్ శిక్షణ తరగతులు ఈ నెల 24న బస్వన్నపల్లి గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు, ప్రతి ఒక్క సభ్యుడు పాల్గొని రైతుల సమస్యలపై పోరాడాలన్నారు. కామారెడ్డి మండల అధ్యక్షుడు చిన్న అంజయ్య, జిల్లా విత్తన ప్రముఖ్ బోర్‌రెడ్డి భైరవరెడ్డి, మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ పది, ఇంటర్‌లో
ప్రవేశాలకు దరఖాస్తులు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఓపెన్ పది, ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటులజి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టడీ సెంటర్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ బి.కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏవైనా సమస్యలతో మధ్యలో బడి మానేసి 14 సంవత్సరాలు వయసు ఉంటే పది పరీక్షలకు, పది పాసై రెగ్యులర్‌గా ఇంటర్ చేయని వారు ఓపెన్ ఇంటర్‌లలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 18 వరకు మాత్రమేనన్నారు. ఇతర వివరాలకు పాఠశాలకు వచ్చి లేదా సెల్ నెంబర్ 97057 71871లకు సంప్రదించాలని సూచించారు.
ప్రిప్రైమరీ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం పాటించాలి
కామారెడ్డి అర్బన్: జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో ప్రి ప్రైమరీ పోస్టులు(71) భర్తీ రోస్టర్ కం మెరిట్ ఆధారంగా చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.హరిలాల్ నాయక్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మదన్‌లాల్ జాదవ్ డిమాండ్ చేశారు. గురువారం అదనపు కలెక్టర్ విక్టర్‌కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఆవిధంగా భర్తీ చేయకపోతే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. రోస్టర్ లేకుండా నియమించిన పోస్టులను రద్దు చేసి మొత్తం ఖాళీలకు రోస్టర్ అమలు చేసి నియమించాలని కోరారు.

24న బస్వన్నపల్లిలో భారత్ కిసాన్ సంఘ్ శిక్షణ తరగతులు