
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
భిక్కనూరు: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారని భిక్కనూరు ప్రభుత్వ వైద్యురాలు యెమిమా అన్నారు. గురువారం భిక్కనూరు గురుకుల పాఠశాలలో పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భోజనానికి ముందు చేతులను కడుక్కునే విధానం గురించి వివరించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎంపీహెచ్‌ఈవో వెంకటరమణ, సూపర్‌వైజర్ రాజమణి, ప్రిన్సిపాల్ రఘు, ఏఎన్‌ఎం యాదమ్మ పాల్గొన్నారు.
కస్తూర్బా వసతి గృహం తనిఖీ
రామారెడ్డి: మండలంలోని కస్తూర్భా వసతి గృహాన్ని రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. వసతి గృహంలో కూరగాయలు, వంట సామగ్రిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో అనారోగ్యంతో ఉన్న పిల్లలను పరీక్షించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సూపర్‌వైజర్ జానకమ్మ, ఆశవర్కర్ మంజుల పాల్గొన్నారు.