
ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి టౌన్: మధ్యాహ్న భోజన(ఎండీఎం) కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం డీఈవో ఎస్.రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సోఫియా మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతన హామీని అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలన్నారు. కోడిగుడ్లను, వంట గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపునూరు చక్రపాణి, కార్మికులు సంగీత, హేమలత, రాజేశ్వరి, సాయిలు, సువర్ణ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.