
సకాలంలో వైద్యం అందడం లేదు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): పశువుల డాక్టర్ అందుబాటులో ఉండటం లేదని, పశువులకు సకాలంలో వైద్యం అందడంలేదని ఆరోపిస్తూ బుధవారం పశువుల దవాఖాన ముందు పశుపోషకులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ దశరథ్‌కు పశువైద్యులు అందుబాటులో ఉండడం లేదని వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ..మండల కేంద్రంలోని వైద్యశాలకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని పేర్కొన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు రోగాలు వచ్చి వైద్యం అందక చనిపోతున్నాయని వాపోయారు. ప్రైవేట్ వైద్యులను సంప్రదిస్తే రూ.వేలల్లో ఖర్చు అవుతున్నాయని అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
కాలం చెల్లిన మందులు..
ప్రభుత్వ పశువైద్యశాలలో కాలం చెల్లిన మందులు ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉన్నాయి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రూ.లక్షల విలువైన మందులు వృథా అవుతున్నా యని ఆరోపించారు. గతంలో కూడా కాలం చెల్లిన మందుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మండల పశుపోషకులు కోరుతున్నారు.

సకాలంలో వైద్యం అందడం లేదు