ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు

Aug 7 2025 7:28 AM | Updated on Aug 7 2025 9:44 AM

ప్రైవ

ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల క్రితం బిచ్కుంద మండలానికి చెందిన ఓ బాలుడికి జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు బాలుడిని నిజామాబాద్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందినట్లు బాలుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసు కుని సముదాయించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి బాధ్యత రహితంగా వ్యవహరించినట్లు నిర్ధారించి ఆస్పత్రికి నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆస్పత్రిని మూసివేయాలని సూచించినట్లు తెలిసింది.

ప్రమాద స్థలం పరిశీలన

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండల కేంద్రంలోని జాతీయ రహదారి–161పై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని, అలాగే 20 రోజుల కింద మండలంలోని పోచారం చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని బుధవారం తహసీల్దార్‌ దశరథ్‌తో కలిసి సీఐ రవీందర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఎంవీఐ రజిని, ఎస్సై అరుణ్‌ కుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మున్నూరు కాపు రాష్ట్ర రైతు

విభాగం ఉపాధ్యక్షుడిగా భాస్కర్‌

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): కుప్రియాల్‌ గ్రామాని కి చెందిన గడీల భాస్కర్‌ను మున్నూరు కాపు సంఘం రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. భాస్కర్‌ మాట్లాడుతూ.. మున్నూరు కాపుల సంక్షేమం కోసం కషి చేస్తానని పేర్కొన్నారు. పదవిని అప్పగించినందుకు రాష్ట్ర, జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.

ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు 1
1/1

ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement