కరుణించని వరుణుడు | - | Sakshi
Sakshi News home page

కరుణించని వరుణుడు

Aug 7 2025 7:26 AM | Updated on Aug 7 2025 7:30 AM

కరుణి

కరుణించని వరుణుడు

వర్షాకాలం సీజన్‌ ప్రారంభమై రెండు నెలలవుతోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు జల్లులు, ఓ మోస్తరు వర్షం కురవడం తప్ప పెద్ద వానల జాడలేదు. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

ర్షాలపైనే ఆధారపడి సాగు చేస్తున్న ఆరుతడి పంటలు సరైన వర్షాలు లేకపోవడంతో ఆరిపోతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా జుక్కల్‌, మద్నూర్‌, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, పిట్లం మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సోయా, పత్తి, పప్పు దినుసుల పంటలు సాగు చేశారు. పది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో చాలా గ్రామాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. గాంధారి, సదాశివనగర్‌, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోనూ వర్షాలపై ఆధారపడి మక్క, పత్తి, సోయా తదితర పంటలు వేశారు. ఆయా మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పెద్దకొడప్‌గల్‌లో వర్షం లేక దెబ్బతింటున్న సోయా పంట

రోహిణి కార్తెకు ముందు వర్షాకాలాన్ని తలపించేలా వానలు కురిపించిన వరుణుడు.. అసలు సీజన్‌లో ముఖం చాటేశాడు. అడపాదడపా జల్లులు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం మినహా.. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురియలేదు. దీంతో జిల్లాలోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 442.6 మి.మీ.కాగా.. ఇప్పటివరకు 391.9 మి.మీ. వర్షపాతమే నమోదయ్యింది. అంటే సాధారణంకన్నా 11 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఎనిమిది మండలాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆయా మండలాల్లో సాధారణంకన్నా 20 శాతంకంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఆయా మండలాల్లో వానాకాలం పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా జుక్కల్‌ నియోజకవర్గంలోని మద్నూర్‌, జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్‌ మండలాలతోపాటు ఎల్లారెడ్డి, బీబీపేట మండలాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి.

నిండని చెరువులు..

జిల్లాలో చెరువులు, కుంటలు 1,425 ఉన్నాయి. 675 చెరువుల్లో 25 శాతం మేర నీరు వచ్చినట్టు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. 25 శాతం నుంచి 50 శాతం దాకా వచ్చినవి 429 చెరువులు. 50 శాతం నుంచి 75 శాతం దాకా నిండినవి 159 కాగా.. 75 శాతం నుంచి 100 శాతం దాకా నిండినవి 123 చెరువులు ఉన్నాయి. పూర్తిగా నిండి అలుగులు పారినవి 39 చెరువులే.. కాగా గత ఏడాది ఇప్పటికే చెరువులు, కుంటలన్నీ అలుగులు పారాయి. ఈసారి లోటు వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితి దారుణంగా ఉంది. మెజారిటీ చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. వాగులు పొంగింది కూడా అంతంతమాత్రమే. దీంతో భూగర్భ జలమట్టం కూడా పెద్దగా వృద్ధి చెందలేదు.

జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైన మండలాల వివరాలు..

మండలం సాధారణం నమోదు వ్యత్యాసం

(మి.మీ.) (మి.మీ.) (శాతం)

పెద్దకొడప్‌గల్‌ 434.4 271.7 –37.5

పిట్లం 408.1 279.3 –31.5

నిజాంసాగర్‌ 435.5 300.2 –30.7

ఎల్లారెడ్డి 499.2 348.9 –30.1

బిచ్కుంద 441.7 339.1 –23.2

మద్నూర్‌ 422.7 330.4 –21.8

బీబీపేట 447.2 352.4 –21.2

జుక్కల్‌ 420.1 333.2 –20.7

ప్రాజెక్టులు వెలవెల..

తడి‘ఆరు’తోంది...

జిల్లాలో 11 శాతం లోటు వర్షపాతం

ఎనిమిది మండలాల్లో

ఇబ్బందికర పరిస్థితి

వెలవెలబోతున్న ప్రాజెక్టులు

చెరువులు, కుంటల పరిస్థితీ అంతే...

ఆందోళనలో రైతాంగం

జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి కూడా చెరువుల్లాగే ఉంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో మంజీర నది పారడం లేదు. దీంతో నిజాంసాగర్‌, పోచారం ప్రాజెక్టుల్లోకి నీరు రావడంలేదు. ఉన్న నీటిని తడుల కోసం వదులుతున్నారు. కౌలాస్‌ నాలా పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కరుణించని వరుణుడు1
1/1

కరుణించని వరుణుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement