ట్రాక్‌ కెమెరాలో చిరుత దృశ్యాలు | - | Sakshi
Sakshi News home page

ట్రాక్‌ కెమెరాలో చిరుత దృశ్యాలు

Aug 7 2025 7:26 AM | Updated on Aug 7 2025 7:30 AM

ట్రాక

ట్రాక్‌ కెమెరాలో చిరుత దృశ్యాలు

మాచారెడ్డి: అక్కాపూర్‌ అటవీ ప్రాంతంలో లేగదూడపై దాడి చేసి చంపిన చిరుతను గుర్తించేందుకు అటవీ అధికారులు మూడు చోట్ల ట్రాక్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ట్రాక్‌ కెమెరాలో చిరుత కదలికలు రికార్డయ్యాయని మాచారెడ్డి ఇన్‌చార్జి ఎఫ్‌ఆర్‌వో రమేశ్‌ తెలిపారు. చంపిన లేగదూడను తినేందుకు మళ్లీ వచ్చిందని పేర్కొన్నారు. పరిసర గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అటవీ ప్రాంతంలో సంచరించవద్దని సూచించారు.

‘317 జీవోను

రద్దు చేయాలి’

బాన్సువాడ : ప్రభుత్వం 317 జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు కేటాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రనాథ్‌ ఆర్య డిమాండ్‌ చేశారు. బుధవారం బాన్సువాడలో తపస్‌ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యాసంస్థలలో నెలకొన్న సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తపస్‌ ప్రతినిధులు తారాచంద్‌, కృష్ణ, వేదప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

‘ఉత్తమ ఫలితాలు

సాధించాలి’

బాన్సువాడ : ఇంటర్‌లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ దాసరి ఒడ్డెన్న సూచించారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను ఆయన సందర్శించారు. ఉదయం ప్రార్థన సమయానికి వచ్చి విద్యార్థులతో పాటు ప్రార్థన చేశారు. గతేడాది ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. గతేడాదికంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు. యూనిట్‌ టెస్టులపై అధ్యాపకులతో మాట్లాడారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ అసద్‌ ఫారూఖ్‌, నోడల్‌ అధికారి సలాం, అధ్యాపకులు శివకుమార్‌, శ్రీనివాస్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ ధర్నాలో జిల్లా నేతలు

కామారెడ్డి టౌన్‌: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్‌ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా ధర్నా నిర్వహించింది. ఇందులో జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఇందుప్రియ పాల్గొన్నారు.

ట్రాక్‌ కెమెరాలో  చిరుత దృశ్యాలు
1
1/3

ట్రాక్‌ కెమెరాలో చిరుత దృశ్యాలు

ట్రాక్‌ కెమెరాలో  చిరుత దృశ్యాలు
2
2/3

ట్రాక్‌ కెమెరాలో చిరుత దృశ్యాలు

ట్రాక్‌ కెమెరాలో  చిరుత దృశ్యాలు
3
3/3

ట్రాక్‌ కెమెరాలో చిరుత దృశ్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement