
పోచారం నుంచి నీటి విడుదల
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి బుధవారం ప్రధాన కాలువలోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఇరిగేషన్ ఇన్‌చార్జి ఎస్‌ఈ మల్లేశ్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్‌పర్సన్ రజితరెడ్డి కలిసి ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని వారు సూచించారు. నీరు చివరి ఆయకట్టుకు చేరేలా చూడాలని ఇరిగేషన్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ అక్షయ్‌కుమార్, వర్క్‌ఇన్‌స్పెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వల్లే..
ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రయత్నం వల్లే ప్రాజెక్టునుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగిరెడ్డిపేటలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జిల్లా అధికారుల నిర్ణయం మేరకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటిపారుదలశాఖ రాష్ట్రస్థాయి అధికారుల అనుమతులతోనే ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అధికారులతో మాట్లాడి పోచారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించారని పేర్కొన్నారు. సమావేశంలో మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, నాయకులు కిష్టయ్య, కిరణ్‌కుమార్, శ్రీరాంగౌడ్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.