
అల్బెండజోల్ మాత్రలను వేయించాలి
కామారెడ్డి టౌన్: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈనెల 11న జిల్లాలో 19 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరికి అల్బెండజోల్ మాత్రలను వేయించాలని అదనపు కలెక్టర్ చందర్‌నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 19 ఏళ్లలోపు విద్యార్థులు అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా విద్య, మున్సిపల్ శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో చంద్రశేఖర్, డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.