
సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరం
కామారెడ్డి టౌన్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలన్నారు. యూఎస్‌పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆకుల బాబు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవులా, నేతలు నరేందర్, గంగారాం, క్యాతం ిసిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు.
యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అనిల్ కుమార్