ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని స ముందర్ తండాలో ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా ఉంది. విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడంతో చిన్నపిల్లలకు అందేవిధంగా ఉందని తండావాసులు ఆరోపించారు. కనీసం చుట్టూ కంచె కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ ఎత్తును పెంచి, దాని చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
పెళ్లి కావడం లేదని ఆత్మహత్యాయత్నం
రామారెడ్డి: పెళ్లి కావడం లేదని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రామారెడ్డి మండలం స్కూల్ తండాలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన మోతీలాల్ అనే యువకుడు తండ్రి దేవ్‌సింగ్‌తో కలిసి వ్యవసాయం చేసే వాడు. ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబసభ్యులు మోతీలాల్‌ను ఆస్పత్రికి తరలించారు.
చుట్టాకు వాహనం స్వాధీనం
లింగంపేట(ఎల్లారెడ్డి): అక్రమంగా చుట్టాకును తరలిస్తున్న వాహనా న్ని సోమవా రం అటవీ శాఖ బీట్ అధి కారి సంరీన్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నాపూర్ గ్రామంలో చుట్టాకును సేకరించి మెదక్‌కు తరలిస్తుండగా పొల్కంపేట శివారులో అడ్డగించి పట్టుకున్నామన్నారు. వాహనంలో సుమారు రూ. 60 వేల విలువ చేసే చుట్టాకు ఉన్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్ స్వామిని పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
దుబాయ్‌లో యువకుడి మృతి
రామారెడ్డి: మండలంలోని గోకుల్ తండాకు చెందిన మాలోత్ భాస్కర్(26) అనే యువకుడు దుబాయ్‌లో అనారోగ్యంతో మరణించినట్లు స్నేహితుల ద్వారా తెలిసింది. ఇంట్లో ఆర్థిక ఇ బ్బందులతో ఉపాధి కోసం గత పది నెలల క్రి తం భాస్కర్ దుబాయ్ వెళ్లాడు. నాలుగు రోజు ల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మృతి వార్త విన్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.
బాన్సువాడ ఆస్పత్రి తనిఖీ
బాన్సువాడ: పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిని సోమవారం కాయకల్ప బృందం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆయా వార్డు ల్లో తిరుగుతూ రోగులకు అందుతున్న సేవ లపై ఆరా తీసారు. అనంతరం ఆస్పత్రి ఆవర ణలో మొక్కలు నాటారు, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సీఎస్‌ఎస్ రఘు, సీనియర్ టెక్నిక ల్ మేనేజర్ ఐసీహెచ్‌హెచ్‌ఏ మేహెర్ వాణీ, ఎస్–క్యూ ఏ వినయ్‌పాల్‌సింగ్, నర్స్ సాయి శీల తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్


