
దోమకొండలో ఉచిత మెగా వైద్య శిబిరం
దోమకొండ: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రయ్యగారి అనంతరెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటెరీ తాటిపల్లి శ్రీకాంత్, శివ బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 600 మందికి ఉచితంగా పలు రకాల పరీక్షలు నిర్వహించి మందులను అందించామని ఆస్పత్రి ఇన్‌చార్జి ఓబుల్‌రెడ్డి తెలిపారు. బీపీ, షూగర్, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, దగ్గు, జ్వరం, ఆయాసం,తలనొప్పి, ఆకలి లేకపోవడం, రక్తహీనతతో పాటు ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమలగౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు శంకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.