
సొసైటీల పదవీకాలం పెంపుపై హర్షం
పిట్లం(జుక్కల్): ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్ పదవీ కాలాన్ని మరోసారి ఆరు నెలలు పొడిగించినందునందుకు గాను మండలంలోని సహకార సంఘం చైర్మన్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, ఎంపీ సురేష్ షెట్కర్‌ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎన్‌డీసీసీబీ డైరెక్టర్ సాయిరెడ్డి, మండలంలోని సహకార సంఘం చైర్మన్లు ,ఒంటరి శపథం రెడ్డి, జార నాగి రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.