
నీటి ఎద్దడి లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. పట్టణ పరిధిలో నీటి సరఫరా కోసం రూ. 50 లక్షలతో కొనుగోలు చేసిన ఐదు ట్యాంకర్లను, రూ. 40 లక్షలతో కొనుగోలు చేసిన పొక్లెయిన్‌ను బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ఇప్పటికే 8 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామన్నారు. పట్టణ విస్తీర్ణం పెరగడం, నీటి ఎద్దడి తలెత్తడంతో అదనంగా ఐదు ట్యాంకర్లను కొనుగోలు చేశామన్నారు. సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కార్యాలయంలో కొనసాగుతున్న ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను పరిశీలించారు. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న మున్సిపల్ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, హౌజింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి బల్దియాకు
ఐదు కొత్త ట్యాంకర్లు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్