నిజామాబాద్ అర్బన్: వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీపీ సాయి చైతన్య బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వి వరాలు వెల్లడించారు. నిర్మ ల్ జిల్లా బాసర, ముథోల్, భైంసా, తానూర్, నిజామాబాద్ జిల్లా నవీపేట్, మాక్లూర్, రెంజల్, వర్ని తదితర పోలీస్ స్టేషన్‌లో బైక్ చోరీ కేసులు నమోదుకాగా, అందులో 15 కేసులను ఛేదించామన్నారు. పాత నేరస్తులైన షేక్ అర్బాజ్, షేక్ ఇమ్రాన్, షేక్ సమీర్‌లు గతంలో బైక్, చైన్ స్నాచింగ్‌కు పాల్పడే వారని, వీరిని నాలుగో టౌన్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు తెలిపారు. వీరిపై గతంలోనే 10 కేసులు ఉన్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా షేక్ అర్బాజ్, షేక్ ఇమ్రాన్, షేక్ సమీర్, షేక్ రెహమాన్ అంతా కలిసి ఒక ముఠాగా ఏర్పడి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలోని వివిధ మండలాల్లో పల్సర్ బైకులే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. నలుగురు కలిసి 17 బైకులను చోరీ చేయగా, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 17 బైకులను బాసరకు చెందిన ఆవేజ్, ధర్మాబాద్‌కు చెందిన షేక్ అర్బాజ్ రహమత్, సోమ్ కాంబ్లే, మనోజ్ షేర్, షాదుల్ షేక్ తక్కువ ధరకు కొనుగోలు చేయగా, వీరి నుంచి బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 13న నవీపేటలోని అయ్యప్ప టెంపుల్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా పోలీసులను చూసి ముఠా సభ్యులు పారిపోతుండగా పట్టుకున్నామన్నారు. సమావేశంలో ఏసీపీ ప్రకాశ్, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సాయినాథ్, ఎస్సై మహేశ్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.
220 గ్రాముల ఆల్ప్రాజోలం పట్టివేత
కామారెడ్డి క్రైం: వివిధ గ్రామా ల్లో నిర్వహించిన దాడుల్లో ముగ్గురు నిందితుల వద్ద నుంచి 220 గ్రాముల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి ఎకై ్సజ్ సీ ఐ సంపత్ కృష్ణ తెలిపారు. కా మారెడ్డి ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. కల్తీకల్లులో కలిపే ఆల్ప్రాజోలం విషయంలో విశ్వసనీయ సమాచారం రావడంతో ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు ముందుగా సదాశివనగర్ మండలం భూంపల్లిలో దాడులు నిర్వహించి గడిపల్లి శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి వద్ద నుంచి 4 గ్రాముల ఆల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా మరో ఇద్దరు వ్యక్తుల ఆచూకీ లభించింది. దీంతో మరోసారి దాడులు చేపట్టి నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన గురం రాజేందర్ గౌడ్ వద్ద 110 గ్రాములు, జలాల్‌పూర్‌కు చెందిన గడ్డం మానిక్య గౌడ్ వద్ద 106 గ్రాముల చొప్పున ఆల్ప్రాజోలంను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్, శరత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


