కామారెడ్డి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తామని, 23వ అసెంబ్లీ ముట్టడిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు నరేందర్‌రెడ్డి, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, నాయకులు విపుల్, శ్రీకాంత్ తదితరులున్నారు.


