ఎల్లారెడ్డిరూరల్ : మండలంలోని అడివిలింగాల గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్‌కుమార్ రాజస్థాన్‌లోని మౌంట్ అబుకు సేంద్రియ వ్యవసాయంతో చేసే సాగుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమానికి వెళ్లినట్లు గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాకు ఒక రైతు చొప్పున రాజస్థాన్‌కు పంపించారు.
గుజరాత్‌లో రోబో కింగ్, దర్తి కంపెనీలను
సందర్శించిన కాసుల
బాన్సువాడ : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో రోబోకింగ్, దర్తి కంపెనీలను శుక్రవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ సందర్శించారు. వ్యవసాయానికి సంబంధించిన పలు యంత్రాలు, రోటవేటర్, స్పిడారు, కట్టర్ తదితర పనిముట్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నుంచి రైతులు సబ్సిడీలపై వ్యవసాయ యంత్రాలను అందజేయనున్న నేపథ్యంలో గుజరాత్‌కు వెళ్లినట్లు కాసుల పేర్కొన్నారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ యూనుస్ తదితరులున్నారు.


