బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్‌కు మంగళవారం వేలం పాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అధ్వర్యంలో ప్రక్రియ సాగింది. కాంట్రాక్టర్ జంషేర్ ఖాన్ రూ. 46.26 లక్షలకు మేకలు, గొర్రెలు సంతను దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత తైబజార్ రూ.43.93 లక్షలు పలికింది.
● రోజువారి సంతను లింగాల ప్రీతంరెడ్డి రూ.9.02 లక్షలకు దక్కించుకున్నారు. ఈ సంతకు గతేడాది కూడా ఇదే ధర లభించింది. పశువుల దాఖలను ప్రీతంరెడ్డి రూ. 20 వేలకు దక్కించుకున్నారు. ఈ సంత గతేడాది రూ. 10 వేలే పలకడం గమనార్హం.
● వారసంతను జగన్మోహన్‌రావు రూ. 12.31 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ సంత రూ. 12.33 లక్షలు పలికింది. తైబజార్‌తోపాటు సంతలను వేలం వేయగా బల్దియాకు గతేడాది కంటే రూ. 2.40 లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని బాన్సువాడ మున్సిపాలిటీ మేనేజర్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు.