ఆస్తుల విభజనలో ఈ–పంచాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆస్తుల విభజనలో ఈ–పంచాయితీ

Mar 24 2025 6:29 AM | Updated on Mar 24 2025 6:29 AM

ఆస్తు

ఆస్తుల విభజనలో ఈ–పంచాయితీ

పోర్టల్‌లో సాంకేతిక లోపాలు

అసెస్‌మెంట్‌లో బ్లాక్‌నంబర్‌

తప్పుగా వస్తున్న వైనం

అధికారుల చుట్టూ

తిరుగుతున్న బాధితులు

దోమకొండ : ఈ –పంచాయతీ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ స్తుల పంపకం చేసుకుంటున్న సమయంలో అసెస్‌మెంట్‌లో బ్లాక్‌నంబర్‌ తప్పుగా రావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండడంలేదు. గ్రామపంచాయతీతో సంబంధం లేకుండా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే మ్యూటేషన్‌ ప్ర క్రియతో పాటు అసెస్‌మెంట్‌ నంబరు కేటాయించడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గ తంలో పంచాయతీ డిమాండ్‌ రిజిస్టర్‌తో పాటు ధ్రు వీకరణ పత్రం, ఇంటి రసీదుతో అసెస్‌మెంటు నంబర్లు తప్పుగా నమోదైతే వాటిని జీపీ కార్యదర్శి రివిజన్‌ రిజిస్టర్‌ ఆధారంగా సరిదిద్దేవా రు. కానీ ప్రస్తుతం సంబంధిత వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడంలేదు.

బ్లాక్‌ మారడంతో..

ప్రభుత్వం గ్రామాల్లో ఇంటి నిర్మాణం, ఇతరత్రా అ నుమతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందు కు ఈ–పంచాయతీ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. సిటిజన్‌ లాగిన్‌ అనుమతులతో పాటు ఇతరత్రా అవసరాలకు లబ్ధిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దర ఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఖాళీ స్థలా లు, ఇళ్లు వంటి ఆస్తులను పంపకాలు చేసుకుని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకు నేప్పుడు మ్యూటేషన్‌ ప్రక్రియ ఇక్కడే పూర్తవుతోంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా బ్లాక్‌ మారి అసెస్‌మెంట్‌ నంబర్‌ కేటాయింపు జరుగుతోంది.

బీబీపేటకు చెందిన రాజయ్య అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని ఆయన ఇద్దరు కుమారులు పంచుకుని స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. పెద్దకుమారుడికి ప్రస్తుతం స్థలానికి ఉన్న ఇంటి నంబర్‌ను అసెస్‌మెంట్‌ ఆధారంగా కేటాయించారు. అదే నంబర్‌తో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న చిన్నకుమారుడికి బ్లాక్‌ మారి అసెస్‌మెంట్‌ తప్పుగా వచ్చింది. చిన్న కుమారుడు ఇంటి నిర్మాణం అనుమతి కోసం గ్రామ పంచాయతీకి వెళ్లగా పంచాయతీ అధికారులు అసెస్‌మెంట్‌ తప్పుగా వచ్చిందంటూ అనుమతి నిరాకరించారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఆయన ఇటు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం.. అటు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉన్నతాధికారులకు వివరించాం

ఆస్తుల పంపకాల విషయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకు న్న తర్వాత అసెస్‌మెంట్‌ నంబర్‌ తప్పుగా వస్తోంది. మ్యూటేషన్‌ సమయంలో ఇంటినంబర్‌ వద్ద బ్లాక్‌ త ప్పుగా చూపిస్తోంది. సమస్యను జిల్లా ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – శ్రీనివాస్‌, డీఎల్‌పీవో, కామారెడ్డి

ఇష్టారాజ్యంగా నమోదు..

వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూ ముల ఆస్తుల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్‌ ప్రా మాణికంగానే నిర్వహించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పంచాయతీల్లో ఎన్పీబీ (నాన్‌ ప్రాపర్టీ బుక్‌)లో ఇళ్లతో పాటు వ్యవసాయేతర భూ ముల వివరాలను నమోదు చేయించింది. ఈ సమయంలో పంచాయతీ డిమాండ్‌ రిజిస్టర్‌తో సంబంధం లేకుండా గ్రామాలు, పట్టణాల్లో జ నాభా ఆధారంగా ఇళ్లు, ప్లాట్ల సంఖ్యను నిర్దేశించి నమోదు చేయాలని సూచించారు. అయితే అప్పట్లో గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇళ్లతో పాటు వ్యవసాయేతర ప్లాట్లకు అసెస్‌మెంట్‌ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేశాక, నిర్దేశిత పోర్టల్‌ను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. అప్పట్లో సరిగా నమోదు చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆస్తుల విభజనలో ఈ–పంచాయితీ1
1/1

ఆస్తుల విభజనలో ఈ–పంచాయితీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement