ఎల్లారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అధిక భాగం మహిళలకే కేటాయించిందని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల మహిళా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు వ్యాపార రంగాలలో రాణించేందుకు స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందిస్తుందన్నారు. మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి తనహయాంలో జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రజిత, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట మండలాల మహిళా అధ్యక్షురాల్లు వాసవి, స్వరూప, జిల్లా మహిళా కార్యదర్శి అరుణ, మండల పార్టీల అధ్యక్షులు సాయిబాబా, నారాగౌడ్, శ్రీధర్‌గౌడ్, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షులు వినోద్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు కుడుముల సత్యనారాయణ, పద్మశ్రీకాంత్, సామెల్, వెంకట్రాంరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్ తదితరులున్నారు.
భవన నిర్మాణ కార్మికుల భవనం ప్రారంభం..
పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల భవనాన్ని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో సాయిబాబా, లక్ష్మణ్ తదితరులున్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైట్లను ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు ప్రారంభించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ స్తంభాలకు నూతనంగా ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఎల్‌ఈడీ లైట్లతో వెలుగులు విరజిమ్ముతాయని ఎమ్మెల్యే అన్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న
పథకాలను ప్రజలకు వివరించాలి
ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు