వాడపల్లి.. భక్తులతో శోభిల్లి.. | - | Sakshi
Sakshi News home page

వాడపల్లి.. భక్తులతో శోభిల్లి..

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

● కిక్కిరిసిన వెంకన్న ఆలయం

● కార్తిక శనివారం కావడంతో రద్దీ

ఆత్రేయపురం: కార్తిక మాసంలో శనివారం సందర్భంగా కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో మాడ వీధులు మార్మోగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో తెల్లవారుజామునుంచే ఆలయంలో రద్దీ నెలకొంది. ముందుగా గోదావరిలో స్నానం ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించుకున్నారు. చాలా మంది మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. కాగా.. స్వామివారిని అర్చకులు వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు వకుళమాత అన్నదాన భవనంలో అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ కమిటీ సభ్యులు సిస్టా సూర్య కుటుంబరావు, అర్చకులు వాడపల్లి సుందర శేశావతారం, ఆలయ సిబ్బంది తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement