క్రీడా సమాచారం | - | Sakshi
Sakshi News home page

క్రీడా సమాచారం

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు నిడదవోలు విద్యార్థినులు

నిడదవోలు: పట్టణంలోని జెడ్పీ బాలికల హైస్కూల్‌ విద్యార్థినులు యోగ్య వచన, హరణ్య లక్ష్మీప్రియాంక హాకీలో అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం అరుణ ఫిలిప్‌ శనివారం తెలిపారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ నెల 22 నుంచి 25 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి అండర్‌ –14 హాకీ పోటీల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. అలాగే హకీ అండర్‌ – 17 విభాగంలో అబ్దుల్‌ సఫియా రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికై ందని, విశాఖ జిల్లాలో త్వరలో జరిగే ఆ పోటీల్లో ఆమె పాల్గొంటుందన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థినులు, పాఠశాల పీఈటీలు సుందర్‌ జేమ్స్‌, కృష్ణకుమారి, శాంతిలను ఉపాధ్యాయులు అభినందించారు.

క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): క్రీడల్లో రాణించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కాకినాడ డివిజన్‌ ఉపవిద్యాశాఖ అధికారి కేవీవీ సత్యనారాయణ అన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జరిగిన రాష్ట్ర స్థాయి స్క్వాష్‌ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి సమాఖ్య కార్యదర్శి, పీడీ పి.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు 11 జిల్లాల నుంచి 300 మంది హాజరయ్యారు. అండర్‌ – 14, 17, 19 విభాగాల్లో బాల బాలికల జట్లను జాతీయ స్థాయికి ఎంపిక చేశారు. పోటీల పరిశీలకుడిగా విశాఖకు చెందిన రామకృష్ణ వ్యవహరించారు. విజేతలకు డీవైఈఓ సత్యనారాయణ బహుమతులు అందజేశారు. డీఎస్‌ఏ కోచ్‌ లక్ష్మణ్‌ పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవంలో డీఎస్‌డీవో సతీష్‌ కుమార్‌, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శి (అడ్మిన్‌)శేషుకుమారి, పీఈటీ సంఘ కార్యదర్శి మాచరరావు, పీడీలు పాల్గొన్నారు.

విజేతల వివరాలు:

● అండర్‌ – 14 బాలుర విభాగంలో రమణ, కార్తికేయ, అరవింద్‌, బాలికల విభాగంలో బ్లెస్సీ, తేజస్విని, సాహితిలు

● అండర్‌ – 17 బాలుర విభాగంలో సాయి వెంకట సూర్య, సందీప్‌, అశ్విన్‌, బాలికల విభాగంలో ఎన్‌.ఐశ్వర్య, స్తుతి కీర్తన, మహిజా

● అండర్‌ – 19 బాలుర విభాగంలో సూరజ్‌, సౌర్య, నిఖిలేష్‌, బాలికల విభాగంలో అభిజ్ఞ, అనన్య, కుందన

బిలియర్డ్స్‌లో నిశాంత్‌ వర్ణన్‌ ప్రతిభ

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): కాకినాడ టౌన్‌హాల్‌లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్‌, స్నూకర్స్‌ పోటీల్లో విజయవాడకు చెందిన నిశాంత్‌ వర్ణన్‌ ప్రతిభ చూపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధిస్తున్నాడు. 5వ తరగతి చదువుతున్న నిశాంత్‌ 3వ తరగతిలోనే బిలియర్డ్స్‌ శిక్షణ ప్రారంభించాడు. బాలుడిలో ఆసక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి పీజీ బెన్ని గమనించి ప్రత్యేక తర్ఫీదు అందించారు. 3వ తరగతిలో సబ్‌ జూనియర్స్‌, 4వ తరగతిలో జూనియర్స్‌ స్థాయిలో జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. 2026 గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్స్‌ పోటీల్లో రజత పతకం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement