హత్య కేసులో మరొకరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో మరొకరి అరెస్ట్‌

Nov 21 2026 12:20 AM | Updated on Nov 21 2026 12:20 AM

14 రోజుల రిమాండ్‌

తాళ్లరేవు: హత్య కేసులో మరో నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాలెపు సతీష్‌, పినపోతు కేశవ, సంగాడి దుర్గా మల్లేశ్వరరావు, సంగాడి కామేష్‌ స్నేహితులు. సతీష్‌, కేశవ, దుర్గా మల్లేశ్వరరావులు చేసిన చోరీల గురించి కామేష్‌ గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం ఇస్తున్నాడన్న అనుమానంతో పైముగ్గురు కామేష్‌పై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో అతని ఇంటికి వెళ్లి వారి వెంట కామేష్‌ను సీతారామపురం కోలాటివారి రేవు వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ కామేష్‌ను కొట్టి, పీకనొక్కి రేవులో పడేశారు. ఆ నేరానికి సంబంధించి ముద్దాయిల్లో ఒకడైన సంగాడి దుర్గామల్లేశ్వరరావును ఈ నెల 14న అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించగా, కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అయితే రిమాండ్‌లో ఉన్న దుర్గా మల్లేశ్వరరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు ముద్దాయిలు హత్య కాబడిన కామేష్‌ బంధువుల దాడిలో గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏ–1గా ఉన్న పాలెపు సతీష్‌ను ఆస్పత్రి నుంచి గురువారం డిశ్చార్జ్‌ చేయగా, సీఐ చైతన్యకృష్ణ జీజీహెచ్‌ ఔట్‌ పోస్ట్‌ వద్ద అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. సతీష్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించగా రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు ఎస్సై వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement