అక్రమ మైనింగ్‌పై అధికారుల దాడి | - | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌పై అధికారుల దాడి

Nov 20 2026 12:37 AM | Updated on Nov 20 2026 12:37 AM

పెద్దాపురం: మండల పరిధిలోని రామేశంమెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై గురువారం రెవెన్యూ, గనుల శాఖ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా మట్టి తవ్వకాలు, తరలింపునకు ఉపయోగిస్తున్న ఐదు జేసీబీలు, రెండు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాలన్నింటినీ రెవెన్యూ అధికారులకు అప్పగించారు. కాగా.. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరూ అందుబాటులో లేరని, అక్కడున్న వాహనాలన్నింటిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బి.అశోక్‌ కుమార్‌ ఆదేశాల మేరకు మైనింగ్‌ అధికారులు సత్యతేజ, రవీంద్ర ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement