నగర అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

నగర అభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వండి

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

కాకినాడ లీగల్‌: వైఎస్సార్‌ సీపీ తరఫున కాకినాడ నగర మేయర్‌ అభ్యర్థిగా కాద సత్యశ్రీ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డి–కన్వెన్షన్‌ హాలు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, సత్యశ్రీ భర్త, ప్రముఖ వైద్యుడు కాద వెంకట రమణతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కోలాహలం నడుమ నామినేషన్‌ కేంద్రానికి చేరుకుంది. బాణసంచా పేలుళ్లు, పార్టీ నినాదాలు, కార్యకర్తల సందడితో ర్యాలీ సాగింది. అనంతరం, కాద సత్యశ్రీ నామినేషన్‌ కేంద్రానికి చేరుకుని రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, కాకినాడ నగర అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలో ప్రస్తుతం పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, రహదారుల పరిస్థితి ఆశించిన స్థాయిలో లేవన్నారు. ఈ సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. తనకు అవకాశం కల్పిస్తే కాకినాడ నగరాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసి స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి సమస్యలు, ప్రజల అవసరాలపై తనకు అవగాహన ఉందని, నగర అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తానని చెప్పారు. నగరంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలకు మరింత చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సత్యశ్రీ పేర్కొన్నారు.

మేయర్‌ అభ్యర్థిగా కాద

సత్యశ్రీ నామినేషన్‌ దాఖలు

భారీ ర్యాలీ

మాజీ మంత్రి కన్నబాబు,

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement