నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని కాకినాడ లిటరరీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డీవీఎన్ రాజు అన్నారు. సోమవారం కాకినాడ టౌన్ హాల్లో లిటరరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బిలియర్డ్స్, స్నూకర్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలకు 140 మంది హాజరయ్యారు. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ సాధించే అవకాశం ఉందని టోర్నమెంట్ కమిటీ అధ్యక్షుడు ఆనంద్ తెలిపారు. మొదటి రెండు స్థానాలు సాధించిన వారు డిసెంబరు 20 నుంచి బెంగళూరులో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు, జాయింట్సెక్రటరీ స్వామి నాయుడు, కోశాధికారి ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


