జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల గాను 379 చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. మిగిలిన ఆరు గ్రామ పంచాయతీల్లో వివిధ కారణాల రీత్యా ఎన్నికలు జరగడం లేదు. ఈ నెల 26న మొదట విడతగా 93, ఈ నెల 29న రెండో విడతలో 149, డిసెంబర్ 2న మూడో విడతలో 137 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ఐదు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, ఐదు వేల నుంచి 10 వేలలోపు జనాభా ఉంటే రూ.25 లక్షలు, 10 వేలు దాటి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. నామినేషన్లు వేయనీయకుండా భయభ్రాంతులకు, బెదిరింపులకు గురి చేసినా, అల్లర్లకు పాల్పడినా సహించేది లేదు. అటువంటి ఘటనలు జరిగితే ప్రజలు 89788 45559 నంబర్‌తో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి, సమాచారం ఇవ్వాలి.
– కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్


