కుప్పకూలిన కొండచరియ రిటైనింగ్‌ వాల్‌ | - | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన కొండచరియ రిటైనింగ్‌ వాల్‌

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

కడియం: మురసు తుపాను ప్రభావంతో కురు స్తున్న భారీ వర్షాలు వేమగిరి జక్కంపూడి నగర్‌లో బీభత్సం సృష్టించాయి. మంగళవారం ఉదయం నుంచీ ఎడతెరిపి లేకుండా కురిసన వర్షానికి కొండచరియ వద్ద నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో, దిగువన ఉన్న మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షానికి కొండచరియ వాలు ఒక్కసారిగా కూలిపోవడంతో శంభాని లక్ష్మణరావు, కరణం అచ్చియ్య, కరణం సత్యవతికి చెందిన ఇళ్లు దెబ్బ తిన్నాయి. ఇళ్ల ప్రహరీలు, భవనాలపై ఉన్న పిట్ట గోడలు, ఎలివేషన్లు పూర్తిగా దెబ్బ తిని ఆస్తినష్టం సంభవించింది. అయితే, ఈ ప్రమాదానికి కొద్దిసేపటి ముందే రిటైనింగ్‌ వాల్‌ దిగువన ఉన్న వారందరూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పెను ప్రమా దం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పంచాయతీ, విద్యుత్‌ శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక నాయకుడు బైరవరుపు మణికంఠ ఆధ్వర్యంలో యువకులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా కొండచరియల ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉండడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇళ్లకు జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేసి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.

ఫ మూడు ఇళ్లకు నష్టం

ఫ త్రుటిలో తప్పిన ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement