మాజీ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరిన మత్స్యకారులు
కాకినాడ రూరల్: కొవ్వూరు తారకరామ నగర్లో టీడీపీ, జనసేనకు చెందిన సుమారు 80 మంది మత్స్యకారులు పాలెపు భైరవస్వామి ఆధ్వర్యాన ఆదివారం వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయం వద్ద మాజీ మంత్రి, ఆ పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు కండువాలు వేసి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి పార్టీల పట్టు సడలిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుందని అన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో పాలెపు మణికంఠ, భరతిమణి వెంకటేష్, గండిమాను వీరబాబు, నగరబోయిన రాజు, ప్రసాద్, ఓలేటి రవిచంద్ర, సత్య, సందీప్, సంతోష్, పెనుబోయిన రాము, పెనుబోయిన లక్ష్మణ్, శ్రీను తదితరులున్నారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పిల్లి చక్రరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బుచ్చిరాజు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.


