నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలి

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

కరప: అర్నబ్‌ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కాకినాడ రూరల్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తుపాను వలన నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో వరి పంట ముంపుకు గురై రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కరప మండలం పెద్దాపురప్పాడు, విజయరాయుడుపాలెం, యండమూరు, జి.భావారం తదితర గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. ముంపుకు గురైన పొలాలను పరిశీలించి, పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రెండు మూడు వారాల్లో కోతకు వచ్చే పంట నీట మునిగిందని, ఇంతవరకూ ఎకరాకు రూ.25 వేలు ఖర్చయిందని, ఇప్పుడు ఎకరాకు 10 బస్తాల దిగుబడి కూడా రాదని రైతులు వాపోయారు. వైఎస్‌ జగన్‌ హయాంలో తుపాన్లు, వర్షాలకు పంట దెబ్బ తింటే ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీతో ఆదుకునేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్లలో రెండు తుపాన్లు వచ్చినా ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదని వాపోయారు. కన్నబాబు మాట్లాడుతూ, గ్రామాల్లో సర్వే నిర్వహించి, దెబ్బ తిన్న పంట విస్తీర్ణాన్ని గుర్తించాలని, పంటల బీమా వర్తింపజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement