రత్నగిరి కిటకిట | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి కిటకిట

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

అన్నవరం: దసరా వేడుకల తొమ్మిదో రోజున మహర్నవమి పర్వదినం సందర్భంగా రత్నగిరి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వీరిలో భవానీ దీక్షాధారులే అధికంగా ఉన్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తూ, మార్గం మధ్యలో స్వామివారి ఆలయానికి విచ్చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా మంగళవారం కూడా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది.

‘పరిషత్‌’ ఎన్నికలకు

పటిష్ట భద్రత

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఈ ఎన్నికల నిర్వహణపై ఎస్పీ బిందుమాధవ్‌, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకుడు గరుడ్‌ సంకేత్‌ సునీల్‌లతో కలసి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీ ఎన్నికలకు జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద, ఎంపీటీసీలకు ఆయా మండల కేంద్రాల్లోను నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

జనసేనకు కీలక నేత గుడ్‌బై

మలికిపురం: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజోలు నియోజకవర్గంలో జనసేన నుంచి కీలక వికెట్‌ పడింది. తమ కంచుకోట అని ఆ పార్టీ చెప్పుకొనే ఈ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేన విజయానికి విశేష కృషి చేసిన సీనియర్‌ నాయకుడు ఆరేటి మురళీకృష్ణ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. జనసేన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ మలికిపురం మండల అధ్యక్షుడు మల్లిపూడి సత్తిబాబుకు తెలిపానని పేర్కొన్నారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని తన ఇంటి వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మురళి ఈ విషయం తెలిపారు. జనసేన అభివృద్ధికి 2009 నుంచీ అహర్నిశలూ పని చేశామని, ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు తనకు నచ్చడం లేదని అన్నారు. జనసేన నిర్ణయాలు కూడా సరైనవి కాకపోవడం వల్ల ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement