జయహో దుర్గాభవానీ అంటూ గ్రామాలు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో సందడిగా కనిపిస్తున్నాయి. మహర్నవమి పర్వదినం సందర్భంగా సోమవారం ఉదయం వివిధ ఆలయాల్లో భక్తులు కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రమణయ్యపేట రెల్లిపేటలో దసరా ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. వాకలపూడి సంతోష్ నగర్ కనకదుర్గ ఆలయంలో పాలపర్తి జోగారావు ఆధ్వర్యాన 108 మంది మహిళలు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. రమణయ్యపేట శేషాద్రి నగర్‌లో ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన బాల కనక దుర్గమ్మను భక్తులు మనసారా కొలిచారు.
– కాకినాడ రూరల్


