సామర్లకోట: స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ పలువురు వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. నిత్యావసర వస్తువుల ధర లు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు, సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంతో కూటమి పార్టీలకు గుడ్‌బై చెబుతున్నారు. సామర్లకోట గణేష్ కాలనీకి చెందిన పలువురు సోమవారం ఆ పార్టీకి జైకొట్టారు. వారికి స్థానిక కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుసుమళ్ల సాయి, మాజీ కౌన్సిలర్ మర్రి శేషారావు, నాయకులు పాలిక చంటి, కచ్చా రాజు తదితరులు పాల్గొన్నారు.


